గుంటూరు జిల్లా చెరుకుపల్లి మండలం లోని నడింపల్లి గ్రామానికి చెందిన శ్రీ వెన్నం సురేంద్ర కుమార్ ఒక కబడ్డీ క్రీడాకారుడు. వీరి సతీమణి శ్రీదుర్గ బి.ఇ.డి. చేసారు. ఈ దంపతులు తమ కుమార్తె అయిన వెన్నం జ్యోతి సురేఖ భవిష్యత్తు కోసం, విజయవాడలో స్థిరపడినారు. చిన్నప్పటినుండి తమ చిన్నారికి ఈతలో శిక్షణ ఇప్పించారు. జ్యోతి తన నాలుగు సంవత్సరాల వయసులోనే తన ఈత విన్యాసాలతో లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు నమోదు చేసుకున్నది. 5 కి.మీ. దూరంలో కృష్ణానదిని మూడు గంటల ఇరవై నిమిషాల ఎనిమిది సెకండ్లలో ఈది, "పిట్ట కొంచెం కూత ఘనం" అనిపించుకున్నది. తరువాత ఈమె విలువిద్యపై గురిపెట్టినది. కొద్దికాలంలోనే ఆ క్రీడపై తనదైన ముద్రవేసింది. 13 సంవత్సరాల వయసులో తొలిసారిగా అంతర్జాతీయ వేదికపై మెరిసిన జ్యోతి, ఇక వెనుదిరిగి చూడలేదు. 2009 లో టైజునాలో మెక్సికన్ గ్రాండ్ టోర్నీలో, అండర్-19 విభాగంలో ఒలింపిక్ రౌండ్లో స్వర్ణ పతకం గెల్చుకున్నది. అదే వేదికపై మరో మూడు రజత పతకాలనూ మరియూ ఒక కాంస్య పతకాన్నీ గూడా స్వంతం చేసుకుని తన ప్రతిభ ప్రదర్శించింది. 2011 లో టెహరానులో జరిగిన ఆసియా ఆర్చెరీ ఛాంపియనుషిప్పు పోటీలలో మహిళా కాంపౌండ్ టీం సభ్యురాలిగా కాంస్య పతకం గెల్చుకున్నది. 2013 లో చైనాలోని "వుక్సి" వేదికగా సాగిన ప్రపంచ యూత్ ఆర్చెరీ ఛాంపియనుషిప్పు పోటీలలో కాంపౌండ్ జూనియర్ ఉమన్ మరియూ కాంపౌండ్ మిక్సెడ్ డబుల్స్ విభాగాలలో కాంస్య పతకాలు సాధించింది. తాజాగా ఈమె 2014 సెప్టెంబరులో, దక్షిణ కొరియాలోని ఇంచియాన్ లో జరుగుచున్న ఆసియా క్రీడలలో భారత ఆర్చెరీ మహిళా జట్టు సభ్యురాలిగా కాంస్య పతకం స్వంతం చేసుకున్నది.
వెన్నం జ్యోతిసురేఖ తల్లిదండ్రుల పేర్లేమిటి?
Ground Truth Answers: శ్రీ వెన్నం సురేంద్ర కుమార్ ఒక కబడ్డీ క్రీడాకారుడు. వీరి సతీమణి శ్రీదుర్గశ్రీ వెన్నం సురేంద్ర కుమార్ ఒక కబడ్డీ క్రీడాకారుడు. వీరి సతీమణి శ్రీదుర్గశ్రీ వెన్నం సురేంద్ర కుమార్ ఒక కబడ్డీ క్రీడాకారుడు. వీరి సతీమణి శ్రీదుర్గ
Prediction: